TSPSC Group 2 Exam Postpone 2024 Demand : టీఎస్పీఎస్సీ గ్రూప్-2 వాయిదా వేయాల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా..భారీగా..
పరీక్షలు వాయిదా వేయడం లేదన్న సీఎం రేవండ్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భారీగా సంఖ్యలో రోడ్డపైకి వచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద భారీగా ట్రాప్క్ జామ్ అయింది. అలాగే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య కూడా పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చిక్కడపల్లి చౌరస్తా నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్లో బైఠాయించి నిరసనన తెలిపారు.
టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంటే మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ గ్రూప్-2 పోస్టులను పెంచి.. ఈ పరీక్షలను డిసెంబర్లో నిర్వహించాలి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అలగే గ్రూప్-2 పోస్టుల సంఖ్య 783 నుంచి 2000 వరకు పోస్టుల వరకు పెంచాలని అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రూప్-3 పోస్టులను 3000 వరకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.