APPSC Group-2 Prelims Exam 2024: 3.40 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్లోడ్... మార్చి 4న ఎస్‌బీఐ క్లర్క్ పరీక్ష!
ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీపీఎస్సీ పూర్తి చేశారు. అయితే.. ఇదే రోజు ఎస్‌బీఎస్ క్లర్క్ పరీక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలో APPSC కీలక ప్రకటన చేసింది. ఎస్‌బీఐ క్లర్క్ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీ ఉందని.. పలువురు మాకు వినతి పత్రం సమర్పించారు. ఇంకా ఎవరైన ఈ రెండు పరీక్షలు రాస్తున్నవారు ఉంటే హాల్‌టికెట్ల కాపీతో ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి 12:00లోపు appschelpdesk@gmail.comకి మెయిల్ చేయండి. వారికి క్లర్క్ పరీక్షను మార్చి 4వ తేదీన నిర్వహించాలని ఎస్‌బీఐని కోరుతాం అని పేర్కొంది.
ఇప్పటివరకు 3.40 లక్షల మంది అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి ఎస్‌బీఐ కూడా సానుకూలంగా స్పందించిందని వారు పేర్కొన్నారు.
గ్రూప్-2లో ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీ..
ఏపీపీఎస్సీ గ్రూప్-2కు దాదాపు 4,83,525 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీపడుతున్నారు. మెయిన్స్ పరీక్ష కోసం APPSC గ్రూప్-2 పరీక్ష 2024 ప్రిలిమ్స్‌లో 1:50 ఎంపిక నిష్పత్తి ఉంటుందని APPSC సభ్యుడు, పరిగె సుధీర్ ట్వీట్ చేశారు. దాదాపు 45 వేల మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు..