TSPSC Group 1 Prelims Exam Date: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ విడుదల, ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎప్పటినుంచంటే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌ -1  ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 9వ తేదీన  నిర్వహించనున్నట్లు  టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇటీవలే 563 పోస్టులకు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రిలీజ్‌ కాగా.. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. దానికి అదనంగా మరిన్ని పోస్టులను చేర్చి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎప్పటి నుంచంటే..
ఇటీవల.. ప్రిలిమ్స్‌ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే అభ్యుర్థులు పెద్ద ఎత్తున గ్రూప్‌-1 పరీక్షలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

#Tags