Sun Unleashes: సౌర విలయం.. సూర్యునిపై చెలరేగుతున్న ప్రచండమైన మంటలు..!

వజ్రపు మొనపై కాంతి ఒక క్రమంలో చెదిరిపోయి చిత్రించిన అందమైన వెలుగు రేఖల్లా కనిపిస్తున్నాయి కదూ..!

కానీ ఇవేమిటో తెలుసా..? సూర్యునిపై చెలరేగుతున్న ప్రచండమైన మంటలు..! వీటిని ఎక్స్‌ కేటగిరీకి చెందిన సోలార్‌ ఫ్లేర్స్‌గా నాసా పేర్కొంది. గత 20 ఏళ్లలో నమోదైన అత్యంత శక్తిమంతమైన మంటలు ఇవేనట..! సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు పునఃసంధానమయ్యే క్రమంలో ఈ మంటలు చెలరేగుతుంటాయి.

తీవ్రతను బట్టి వాటిని బీ, సీ, ఎం, చివరగా అతి తీవ్రమైన మంటలను ఎక్స్‌గా వర్గీకరిస్తారు. ఇవి వరుసగా ఒక దానికంటే మరొకటి పదిరెట్లు శక్తిమంతమైనవన్నమాట. తాజా మంటలు ఎక్స్‌ కేటగిరీలోనూ అతి తీవ్రతతో కూడినవని నాసా వివరించింది. వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కొద్దిసేపు రేడియో ధార్మికత బాగా పెరిగిపోయింది. వీటి దెబ్బకు ఆయా చోట్ల రెండు గంటలకు పైగా సిగ్నల్స్‌కు అంతరాయం కూడా కలిగిందట. 2003లో వీటికంటే 15 రెట్లు శక్తిమంతమైన సోలార్‌ ఫ్లేమ్స్‌ నమోదయ్యాయి..!

Covid Subvariant JN.1: కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. దేశంలో మొద‌టి కేసు ఎక్క‌డ‌ నమోదయ్యిందంటే..!

#Tags