Most Powerful Passports In World- పవర్‌ఫుల్‌ పాస్ట్‌పోర్ట్‌, వీసా లేకుండానే ఈ దేశాలు చుట్టిరావొచ్చు

Most Powerful Passports In World

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ట్‌పోస్ట్‌ జాబితాలో భారత్‌కు టాప్‌-100లో చోటు దక్కింది. లండన్‌కు చెందిన సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించిన జాబితా (హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023) ఆరుదేశాల పాస్ట్‌పోర్ట్‌లు అగ్రస్థానంలో నిలిచాయి.

వీసా లేకుండా ప్రయాణం
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ మొదటి ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ ఆరు దేశాల పౌరులు 194 ఇతర దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.గత ఐదేళ్లుగా జపాన్, సింగపూర్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో ఉంది.

భారత పాస్‌పోర్ట్‌తో దాదాపు 62 దేశాలు చుట్టిరావొచ్చు. ఆ దేశాల్లో.. భూటాన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌, బార్బడోస్, థాయిలాండ్, జోర్డాన్, మలేషియా, మాల్దీవులు, శ్రీలంక, మారిషస్, ఇండోనేషియా వంటివి ఉన్నాయి.


టాప్‌-10 అత్యంత శక్తివంతమైన పాస్ట్‌పోర్ట్‌ల జాబితా


1. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, సింగపూర్‌, స్పెయిన్‌ (మొదటి స్థానంలో ఈ ఆరు దేశాలు చోటు దక్కించుకున్నాయి)
2. ఫిన్‌ల్యాండ్‌, సౌత్‌ కొరియా, స్వీడెన్‌
3. ఆ‍స్ట్రియా, డెన్‌మార్క్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్‌
4. బెల్జియం, నార్వే, పోర్చుగల్‌, యూకే,లక్సెంబర్గ్
5. గ్రీస్‌, మాల్టా, స్విట్జర్లాండ్‌
6. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, చెకియా,పోలాండ్‌
7. కెనడా, హంగేరి, యూనైటెడ్‌ స్టేట్స్‌
8. ఎస్టోనియా, లిథుయానియా
9. లాట్వియా, స్లావాకియా, స్లొవానియా
10. ఐస్‌ల్యాండ్‌

#Tags