Faculty Jobs: జూనియర్‌ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అప్లై చేశారా?

అడ్డతీగల: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ నున్నం రాజేంద్రస్వామి తెలిపారు. జువాలజీ, కామర్స్‌, ఫిజిక్స్‌ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. సంబంధిత సబ్జెక్ట్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు.

Bank Jobs 2024: ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో నెలకు రూ. 65వేల వేతనం.. అప్లై చేశారా?

దరఖాస్తుదారులు ఈనె ల 18న కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. ఎంపికై అభ్యర్థులకు గంటకు రూ.150 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.10 వేలు గౌరవ వేతనం చెల్లిస్తారని ఆయన తెలిపారు.

#Tags