Guest Lecturer Posts: గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

నారాయణపేట రూరల్‌: గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక ప్రతిపాదికన విద్యాబోధన చేసేందుకు అర్హులైన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆరు గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలో బోధించుటకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 15 శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అన్ని సబ్జెక్టులకు డెమో నిర్వహిస్తామని, నారాయణపేట సోషల్‌వెల్ఫేర్‌ స్కూల్‌కి ఆసక్తి కల్గిన అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని కోరారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. నెలకు రూ. 25వేల వరకు జీతం

నేడు ధ్రువపత్రాల పరిశీలన
జిల్లాలో ఎస్‌జీటీలు విధులు నిర్వహిస్తూ ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పదోన్నతికి అర్హులైన ఉపాధ్యాయులు శుక్రవారం తమ సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని డీఈఓ ఎండీ అబ్దుల్‌ఘని తెలిపారు.

ఇంటర్మీడియట్‌, టీటీసీ అర్హతతో 1983 నుంచి 2012 డీఎస్సీలో ఎంపికై న టీచర్లు వారి టెన్త్‌, ఇంటర్‌ మెమోలు, డీఏడ్‌ ధ్రువపత్రం, ఉపాధ్యాయ నియామకపత్రం, కుల, అంగవైకల్య ధ్రువపత్రాలు, సర్వీసు పుస్తకంతో కృష్ణగోకులం స్కూల్‌లో ఏర్పాటు చేసిన శిబిరానికి హాజరుకావాలని సూచించారు.

#Tags