ఇంజనీరింగ్ ఆప్షన్ల గడువు 29 రాత్రి వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల గడువును ఈ నెల 29 వ తేదీ రాత్రి 10 గంటల వరకు పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్ ఎంవీరెడ్డి తెలిపారు.
13 కాలేజీలకు అనుమతులు రావడంతో వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చామని, అదనంగా 1,534 సీట్లు రావడంతో కన్వీనర్ కోటాలో సీట్ల సంఖ్య 69,617 కు చేరిందని వెల్లడించారు. కొత్తగా చేర్చిన కాలేజీలు, బ్రాంచీల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. విద్యార్థులు వాటిని చూసుకొని ఆప్షన్లు ఇచ్చుకోవాలని, ఇదివరకే ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు మార్పులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ నెల 30 న రాత్రి 10 గంటల తరువాత సీట్లను కేటాయిస్తామని, 2 వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని వెల్లడించారు. చివరి దశ కౌన్సెలింగ్‌లో 24,954 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు.
#Tags