TS EdCET 2024: టీఎస్ ఎడ్‌సెట్–2024 నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇలా..
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీఎస్‌సీహెచ్‌ఈ).. 2024–25 సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల బీఈడీ రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్‌సెట్–2024) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: సీబీటీ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.05.2024.
పరీక్ష తేది: 23.05.2024(గురువారం)
వెబ్‌సైట్: https://edcet.tsche.ac.in/
చదవండి: APRJC CET 2024 Notification: ఏపీఆర్‌జేసీ సెట్ 2024 నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇలా..
#Tags