TS DSC 2024 Result Release Date Announced : డీఎస్సీ-2024 ఫ‌లితాల విడుద‌ల తేదీపై.. డిప్యూటీ సీఎం ఇచ్చిన క్లారిటీ ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ డీఎస్సీ-2024 ఫ‌లితాల విడుద‌ల తేదీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టి.. ప‌రీక్ష‌ల‌ను కూడా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ 'కీ' ని ఇటీవలే విడుదల చేశారు. ఈ డీఎస్సీ ఫ‌లితాల కోసం దాదాపు  2.50 ల‌క్ష‌ల మందికి పైగా అభ్య‌ర్థులు ఎదురుచూస్తున్నారు.

☛➤ డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల్లో ఇంత దార‌ణ‌మా..! 18 ప్ర‌శ్న‌లు.. మ‌ళ్లీ రోజు అవే 18 ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా..? ఇంకా..

30 వేల మందికి పదోన్నతలు.. 6000 పోస్టుల‌కు కొత్తగా...
సెప్టెంబర్‌ 5వ తేదీన హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. ఈ ప్రభుత్వం 45 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు 30 వేల మందికి పదోన్నతులు కల్పించింది. ఇటీవల 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశాము. వారం రోజుల్లో ఆ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. త్వరలో మరో 6 వేల పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటు.. మ‌రో సారి టెట్ నోటిఫికేష‌న్ కూడా ఇవ్వడానికి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

#Tags