UPSC Notification 2024: ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నోటిఫికేషన్‌ విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. 2025 సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ(ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) మొదటి విడత నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
UPSC Notification 2024 UPSC NDA & NA (I) Exam Notification 2025

మొత్తం ఖాళీల సంఖ్య: 406

  • నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ- 370
  • నేవల్‌ అకాడమీ- 36

కోర్సులు: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ(ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ పరీక్షలో మెరిట్‌ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు.

Infosys Recruitment Drive: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే, దరఖాస్తుకు ఇదే చివరి తేది

అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే.. ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు అర్హులే.

Students Debarred: డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో 13 మంది డిబార్‌


వయసు: 02.07.2006కి ముందు 01.07.2009కి తర్వాత జన్మించి ఉండకూడదు.

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశ­ల్లో జరుగుతుంది. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్‌–పర్సనాలిటీ టెస్ట్,ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ, మె డికల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తా­రు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.

Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 31, 2024
ఆన్‌లైన్‌ రాతపరీక్ష: ఏప్రిల్‌ 13, 2024
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

#Tags