Wimbledon Prize Money: భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫ్రైజ్‌మనీ.. ఎంతంటే..?

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్ టోర్నీ ఫ్రైజ్‌మనీ భారీగా పెరిగింది.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో 50 మిలియ‌న్ల పౌండ్ల(రూ.534 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ఇవ్వ‌నున్నారు. ఈ విషయాన్ని ఆల్‌ ఇంగ్లండ్‌ లాన్ టెన్నిస్ క్లబ్ (AELTC) ప్రకటించింది. 

అదేవిధంగా పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఒక్కో విజేతకు 2.7 మిలియ‌న్ల పౌండ్లు (సుమారు రూ.29.60 కోట్లు) దక్కనున్నాయి. 

2023లో ఫ్రైజ్‌మనీతో పోలిస్తే ప్రస్తుతం ప్రైజ్‌మనీ విలువ 11.9 శాతం అదనం. టోర్నీ ఫ‌స్ట్ రౌండ్‌లో ఓడిన ఆట‌గాడికి 60 వేల పౌండ్లు ఇవ్వ‌నున్నారు. ఈ సంవ‌త్స‌రం వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జూలై 1 నుంచి 14వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

Carlos Alcaraz: అతిచిన్న వయస్సులోనే ‘ఫ్రెంచ్‌ కింగ్‌’.. ఎంత ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడంటే..!

#Tags