Puja Tomar: తొలి ఎంఎంఏ ఫైటర్‌గా రికార్డు.. ఎవరీ పూజా తోమర్?

భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA) ఫైటర్ పూజా తోమర్ అద్భుతమైన ఘనత సాధించింది.

అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC)లో బౌట్ గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళగా ఆమె చరిత్రలో నిలిచింది.

జూన్ 8న లూయిస్‌విల్లేలో జరిగిన పోటీలో, బ్రెజిల్ ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను 30-27, 27-30, 29-28 స్కోరుతో ఓడించి పూజా విజయం సాధించింది. 

పూజా ఎవరు?
➤ 28 ఏళ్ల పూజా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జన్మించింది.
➤ వుషు (చైనీస్ యుద్ధ కళ) తో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది.
➤ వుషులో జాతీయ టైటిళ్లను గెలుచుకుంది.
➤ 2012లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లోకి ప్రవేశించింది.
అనేక ఎంఎంఏ ప్రమోషన్‌లలో పోటీపడి గెలిచింది.
➤ 2023లో యుఎఫ్‌సీతో ఒప్పందం కుదుర్చుకుంది.

French Open title: నాలుగో సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన పోలండ్‌ స్టార్.. 

#Tags