ICC Test Batter Rankings: దశాబ్దకాలం తర్వాత​ విరాట్‌ కోహ్లి చేదు అనుభవం

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గతంలో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌ ర్యాంకు అందుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

కానీ దశాబ్దకాలం తర్వాత విరాట్‌ ఐసీసీ టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-20లో నుంచి బయటికి వచ్చాడు.  

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత స్టార్స్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఘోరంగా విఫలం కావడంతో ఆ ప్రభావం వారిద్దరి ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. బుధవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లి, రోహిత్‌ శర్మ టాప్‌–20లో చోటు కోల్పోయారు. కోహ్లి ఎనిమిది స్థానాలు దిగజారి 22వ ర్యాంక్‌లో, రోహిత్‌ రెండు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్‌లో నిలిచారు. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 93 పరుగులు, రోహిత్‌ 91 పరుగులు సాధించారు. మరోవైపు భారత్‌కే చెందిన యశస్వి జైస్వాల్‌ ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్‌లో నిలువగా.. రిషబ్‌ పంత్‌ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లోకి వచ్చాడు. శుబ్‌మన్‌ గిల్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌లో నిలిచాడు.  

Wriddhiman Saha: రిటైర్‌మెంట్‌ ప్రకటించిన టీమిండియా స్టార్‌ క్రికెటర్

#Tags