Almaty Open: ఏటీపీ–250 టోర్నీ టైటిల్ గెలుచుకున్న‌ రిత్విక్‌–అర్జున్‌ జోడీ

కజకిస్తాన్‌లో అక్టోబ‌ర్ 20వ తేదీ ముగిసిన అల్మాటీ ఓపెన్‌ అసోసియేన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్‌–అర్జున్‌ జోడీ డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది.

వీరిద్దరి కెరీర్‌లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ టైటిల్‌. ఒక గంటా 41 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రిత్విక్‌–అర్జున్‌ జంట 3–6, 7–6 (7/3), 14–12తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో నికోలస్‌ బారింటోస్‌ (కొలంబియా)–స్కాండర్‌ మన్సూరి (ట్యూనిషియా) జోడీపై గెలిచింది.

విజేతగా నిలిచిన రిత్విక్‌–అర్జున్‌లకు 54,780 డాలర్ల (రూ.46 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

23 ఏళ్ల రిత్విక్‌ ఈ ఏడాది మూడు ఏటీపీ–250 టోర్నీల్లో (హాంగ్జౌ, అట్లాంటా, న్యూపోర్ట్‌) ఆడినా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. 

Hockey India League: మహిళల హాకీ ఇండియా లీగ్‌ వేలం.. అగ్రస్థానంలో నిలిచిన ప్లేయ‌ర్ ఈమెనే..

అయితే నాలుగో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం టైటిల్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు రిత్విక్‌ 10 ఏటీపీ చాలెంజర్‌ టోర్నీల్లో డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడింటిలో టైటిల్స్‌ నెగ్గి, ఏడింటిలో రన్నరప్‌గా నిలిచాడు.

#Tags