Rafael Nadal: టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన రాఫెల్‌ నాదల్

ప్రపంచ టెన్నిస్‌లో దిగ్గజంగా గుర్తింపు పొందిన రాఫెల్ నాదల్ రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తన అద్భుతమైన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

గతంలోనే ప్రకటించినట్లుగా డేవిస్‌కప్‌ టోర్నీలో జాతీయ జట్టుకు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను రిటైరయ్యాడు. భారత కాలమానం ప్రకారం న‌వంబ‌ర్ 19వ తేదీ అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్‌ ఫైనల్లో స్పెయిన్‌ 1–2తో నెదర్లాండ్స్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. 

స్పెయిన్‌ తరఫున తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన నాదల్‌పై 6–4, 6–4 స్కోరుతో బొటిక్‌ వాన్‌ డి జాండ్‌షుల్ప్‌ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సింగిల్స్‌లో అల్‌కరాజ్‌ 7–6 (7/0), 6–3తో గ్రీక్‌స్పూర్‌ను ఓడించి 1–1తో సమం చేశాడు. 

నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్‌ జోడీ వాన్‌ డి జాండ్‌షుల్ప్‌–వెస్లీ కూల్‌హాఫ్‌ 7–6 (7/4), 7–6 (7/3) స్కోరుతో స్పెయిన్‌ ద్వయం అల్‌కరాజ్‌–మార్సెల్‌ గ్రానోలర్స్‌ను ఓడించింది. స్పెయిన్‌ నిష్క్రమణతో నాదల్‌కు ఇదే చివరి పోరుగా మారింది.

Wriddhiman Saha: రిటైర్‌మెంట్‌ ప్రకటించిన టీమిండియా స్టార్‌ క్రికెటర్
 
నాదల్ వరుసగా 19 ఏళ్ల పాటు.. 

  • 2024: 0
  • 2023: 0
  • 2022: 4 
  • 2021: 2 
  • 2020: 2 
  • 2019: 4 
  • 2018: 5
  • 2017: 6
  • 2016: 2 
  • 2015: 3 
  • 2014: 4 
  • 2013: 10 
  • 2012: 4 
  • 2011: 3 
  • 2010: 7 
  • 2009: 5
  • 2008: 8 
  • 2007: 6 
  • 2006: 5 
  • 2005: 11 
  • 2004: 1 

మొత్తం  92

రాఫెల్‌ నాదల్‌ 2004లో తొలిసారి ఏటీపీ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచాడు. పోలాండ్‌లోని సొపోట్‌ నగరంలో జరిగిన ఐడియా ప్రొకామ్‌ ఓపెన్‌ టోర్నీలో నాదల్‌ విజేతగా నిలిచాడు. ఆ ఏడాది నుంచి వరుసగా 19 ఏళ్లపాటు (2022 వరకు) నాదల్‌ కనీసం ఒక్క టైటిల్‌ అయినా సాధిస్తూ వచ్చాడు. గాయాల కారణంగా 2023లో, ఈ ఏడాది నాదల్‌ టైటిల్‌ గెలవలేకపోయాడు.

Rani Rampal: రిటైర్మెంట్ ప్రకటించిన 'భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్‌'

అంకెల్లో నాదల్‌ కెరీర్‌.. 

  • సింగిల్స్‌ విభాగంలో గెలిచిన మ్యాచ్‌లు : 1080 
  • సింగిల్స్‌ విభాగంలో ఓడిన మ్యాచ్‌లు : 227 
  • ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లో కొనసాగిన వారాలు : 910 
  • ప్రపంచ నంబర్‌వన్‌గా  కొనసాగిన వారాలు : 209 
  • కెరీర్‌ మొత్తంలో నెగ్గిన సింగిల్స్‌ టైటిల్స్‌ : 92 
  • క్లే కోర్టులపై గెలిచిన సింగిల్స్‌ టైటిల్స్‌ :63 

➣ మొత్తం నెగ్గిన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌: 14, ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌: 2; వింబుల్డన్‌: 2, యూఎస్‌ ఓపెన్‌: 4) 
➣ గెలిచిన ఒలింపిక్స్‌ స్వర్ణాలు (2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సింగిల్స్‌; 2016 రియో ఒలింపిక్స్‌లో డబుల్స్‌) 
➣  డేవిస్‌కప్‌ టీమ్‌ టైటిల్స్‌(2004, 2009, 2011, 2019)

➣ నాదల్‌ కెరీర్‌లో సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ 13,49,46,100 డాలర్లు (రూ.1138 కోట్లు)

Women’s T20 World Cup Winners: మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతల జట్లు ఇవే..

#Tags