Mirabai Chanu: ఒలింపిక్స్‌లో మీరాబాయికి త్రుటిలో చేజారిన పతకం

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారతదేశం తన పతకాల సంఖ్యను పెంచుకోవడంలో త్రుటిలో చేజారింది.

మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో భారతదేశపు స్టార్‌ ఆటగార్తు మీరాబాయి చాను నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

➤ 12 మంది పోటీపడ్డ ఫైనల్లో మీరాబాయి మొత్తం 199 కేజీల బరువును ఎత్తి నాలుగో స్థానంలో నిలిచింది. ముందుగా ఆమె స్నాచ్‌లో 88 కేజీలు.. త‌ర్వాత‌ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 111 కేజీల బరువెత్తింది. 
➤ గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకాన్ని గెలిచింది.
➤ మీరాబాయి పారిస్‌లోనూ పతకం సాధించి ఉంటే ఒలింపిక్స్‌ వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందేది.

➤ చైనాకు చెందిన‌ హు జిహుయ్ 206 కేజీల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
➤ రొమేనియా యొక్క మిహేలా వలెంటీనా 205 కేజీల బరువును ఎత్తి రజత పతకాన్ని సాధించింది.
➤ థాయ్‌లాండ్‌కు చెందిన‌ సురోద్చనా ఖాంబావ్‌ 200 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

Paris Olympics: మనూ భాకర్‌కు మరో గౌరవం.. ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా..

అవినాశ్‌కు 11వ స్థానం.. 
మరోవైపు ఆగ‌స్టు 7వ తేదీ అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఫైనల్లో భారత అథ్లెట్‌ అవినాశ్‌ సాబ్లే 8 నిమిషాల 14.18 సెకన్లలో గమ్యానికి చేరి 11వ స్థానంలో నిలిచాడు. సూఫియాన్‌ (మొరాకో) స్వర్ణం, రూక్స్‌ (అమెరికా) రజతం, కిబివోట్‌ (కెన్యా) కాంస్యం గెలిచారు.

#Tags