Federation Cup 2024: ఫెడరేషన్ కప్‌లో నీరజ్‌ చోప్రాకు స్వర్ణం

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్ల తర్వాత స్వదేశంలో తొలిసారి బరిలోకి దిగి అద్భుత విజయం సాధించాడు.

మే 15వ తేదీ జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్‌లో 82.27 మీటర్ల దూరం జావెలిన్ విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.

ఇటీవల దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్, ఈ టోర్నీలోనూ తన ప్రాభవాన్ని చాటుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో అతను 82.27 మీటర్ల దూరం జావెలిన్ విసిరి, పోటీలో మిగిలిన అథ్లెట్లను చాలా వెనక్కి నెట్టాడు.

కర్ణాటకకు చెందిన డీపీ మనూ 82.06 మీటర్లతో రజత పతకం, మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో కాంస్య పతకం సాధించారు. గతేడాది ఆసియా క్రీడల్లో రజత పతకం గెలుచుకున్న కిశోర్ కుమార్ జెనా 75.25 మీటర్ల దూరంతో ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Neeraj Chopra: మూడేళ్ల తర్వాత బరిలోకి దిగ‌నున్న‌ నీరజ్‌ చోప్రా

చివరిసారిగా భారతదేశంలో 2021లో ఫెడరేషన్ కప్‌లో పాల్గొన్న నీరజ్, అప్పుడూ స్వర్ణ పతకం సాధించాడే గుర్తుంచుకోండి. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇదే టోర్నీలో గెలిచి, తన స్థిరత్వాన్ని చాటుకున్నాడు.

#Tags