FIFA Mens Rankings: ఫిఫా పురుషుల టీమ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అర్జెంటీనా జట్టు

ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) పురుషుల టీమ్‌ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు వరుసగా రెండో ఏడాదిని నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించింది.

డిసెంబ‌ర్ 19వ తేదీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు 1867.25 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది.

ఇక ఫ్రాన్స్‌ జట్టు రెండో స్థానంలో, స్పెయిన్‌ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. గత నవంబర్‌లో విడుదలైన ర్యాంకింగ్స్‌తో పోలిస్తే, అంతర్జాతీయ స్థాయిలో తగ్గిన మ్యాచ్‌ల సంఖ్య కారణంగా ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులు ఉండలేదు.

ఇంగ్లండ్ (4), బ్రెజిల్ (5), పోర్చుగల్ (6), నెదర్లాండ్స్ (7), బెల్జియం (8), ఇటలీ (9), జర్మనీ (10) జట్లు వరుసగా 4వ నుంచి 10వ స్థానాలలో ఉన్నాయి.

T20 Series: టీ20లో ‘రికార్డు’ విజయం సాధించిన‌ భారత మహిళల జట్టు

అంగోలా జట్టు ఈ ఏడాది అత్యధిక మ్యాచ్‌లు ఆడింది. తద్వారా 32 స్థానాలు ఎగబాకి 85వ ర్యాంక్‌లో నిలిచింది. భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 126వ ర్యాంక్‌లో ఉంది. తదుపరి ర్యాంకింగ్స్‌ను 2025 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.

#Tags