Jannik Sinner: ఈ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచిన ఇటలీ టెన్నిస్‌ స్టార్

ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ ఐదో సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఆగ‌స్టు 20వ తేదీ ముగిసిన సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీలో 23 ఏళ్ల సినెర్‌ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో సినెర్‌ 7–6 (7/4), 6–2తో ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు. 

సినెర్‌కు 10,49,460 డాలర్ల (రూ.8 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

ఈ టోర్నీకి ముందు సినెర్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్, మయామి మాస్టర్స్‌ టోర్నీ, రోటర్‌డామ్‌ ఓపెన్, హాలె ఓపెన్‌లలో టైటిల్స్‌ గెలిచాడు.  

ఈ టోర్నీ మహిళల విభాగంలో..
మరోవైపు ఇదే టోర్నీ మహిళల విభాగంలో బెలారస్‌ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా కూడా తొలిసారి విజేతగా అవతరించింది. గతంలో మూడుసార్లు సెమీఫైనల్‌ చేరి ఓడిపోయిన సబలెంకా ఈసారి మాత్రం టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో సబలెంకా 6–3, 7–5తో జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. 

సబలెంకాకు 5,23,485 డాలర్ల (రూ.4 కోట్ల 38 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి.

Aman Sehrawat: యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ ర్యాకింగ్స్‌లో భార‌త స్టార్ రెజ్ల‌ర్ అమ‌న్‌కు రెండో ర్యాంక్

#Tags