జనవరి 2018 అవార్డ్స్

పద్మ పురస్కారాలు - 2018
2018 సంవత్సరానికి 85 మంది పేర్లతో పద్మ అవార్డుల (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) జాబితాను జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మ్యూజిక్ మేో్ట్ర ఇళయరాజా, హిందుస్తానీ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్, వివేకానంద కేంద్రం (కన్యాకుమారి) అధ్యక్షుడు పరమేశ్వరన్‌లు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2009లో ఇళయరాజా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
పద్మ భూషణ్ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బిలియర్డ్స్ ప్రపంచ చాంపియన్ పంకజ్ అడ్వాణీ, గోవా చిత్రకారుడు లక్ష్మణ్ పాయ్, ఆధ్యాత్మికవేత్త ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్, పురాతత్వవేత్త రామచంద్రన్ నాగస్వామిసహా తొమ్మిది మంది ఉన్నారు. సామాజికసేవ, ప్రజాసంబంధాలు, ఇంజనీరింగ్, వాణిజ్య, విద్య, వైద్య, సాహిత్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలందించిన 73 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
ఈ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఒక్కరే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో 16 మంది విదేశీ, ఎన్నారై ప్రతినిధులున్నారు. ఇందులో ముగ్గురికి మరణానంతరం పద్మ అవార్డులు ప్రకటించారు. భారత్‌లో రష్యా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్ కడాకిన్‌కు (మరణానంతర) పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది.
పద్మ విభూషణ్ విజేతలు

పేరు

రంగం

రాష్ట్రం

ఇళయరాజా

సంగీతం

తమిళనాడు

గులాం ముస్తఫాఖాన్

సంగీతం

మహారాష్ట్ర

పరమేశ్వరన్ పరమేశ్వరన్

సాహిత్యం, విద్యారంగం

కేరళ



పద్మ భూషణ్ విజేతలు:

పేరు

రంగం

రాష్ట్రం

మహేంద్ర సింగ్ ధోనీ

క్రీడలు(క్రికెట్)

జార్ఖండ్

పంకజ్ అడ్వాణీ

క్రీడలు(బిలియర్డ్స్)

కర్ణాటక

ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్

ఆధ్యాత్మికం

కేరళ

అలెగ్జాండర్ కడాకిన్

ప్రజాసంబంధాలు

రష్యా(మరణానం తర/విదేశీ)

రామచంద్రన్ నాగస్వామి

పురాతత్వ విభాగం

తమిళనాడు

వేదప్రకాశ్ నంద

సాహిత్యం, విద్యారంగం

అమెరికా

లక్ష్మణ్ పాయ్

కళారంగం

గోవా

అరవింద్ పారిఖ్

సంగీతం

మహారాష్ట్ర

శారదాసిన్హా

సంగీతం

బిహార్



పద్మశ్రీ విజేతలు:

పేరు

రంగం

రాష్ట్రం

అభయ్ భంగ్

వైద్యం

మహారాష్ట్ర

రాణి బంగ్

వైద్యం

మహారాష్ట్ర

దామోదర్ గణేశ్ బాపత్

సామాజిక సేవ

ఛత్తీస్‌గఢ్

ప్రఫుల్ల గోవింద బారాహ్

సాహిత్యం, పాత్రికేయం

అస్సోం

మోహన్ స్వరూప్ భాటియా

సంగీతం

ఉత్తరప్రదేశ్

సుధాన్షు బిశ్వాస్

సామాజిక సేవ

పశ్చిమ బెంగాల్

మిరాబాయి చాను

క్రీడలు

మణిపూర్

శ్వామ్‌లాల్ చతుర్వేది

సాహిత్యం, పాత్రికేయం

ఛత్తీస్‌గఢ్

ఎల్ సుబదాని దేవి

కళలు-నేత

మణిపూర్

సోమ్‌దేవ్ దేవర్‌మాన్

క్రీడలు-టెన్నిస్

త్రిపుర

యషి ధోడెన్

వైద్యం

హిమాచల్ ప్రదేశ్

అరుప్ కుమార్ దత్త

సాహిత్యం, విద్య

అస్సోం

డాదరరంగే గౌడ

కళలు-గేయ రచన

కర్ణాటక

అరవింద్ గుప్త

సాహిత్యం, విద్య

మహారాష్ట్ర

దిగంబర్ హందా

సాహిత్యం, విద్య

జార్ఖండ్

అన్వర్ జలాల్పురి (మరణానంతరం)

సాహిత్యం,విద్య

ఉత్తరప్రదేశ్

పియాంగ్ టెంజిన్ జామిర్

సాహిత్యం, విద్య

నాగాలాండ్

సితవ్వ జొద్దాటి

సామాజిక సేవ

కర్ణాటక

మల్తీ జోషి

సాహిత్యం,విద్య

మధ్యప్రదేశ్

మనోజ్ జోషి

కళలు - నటన

మహారాష్ట్ర

రామేశ్వర్లాల్ కబ్రా

వ్యాపారం

మహారాష్ట్ర్ర

పాన్ కిషోర్ కౌల్

కళలు

జమ్ము కశ్మీర్

విజయ్ కచ్లు

కళలు - సంగీతం

పశ్చిమ బెంగాల్

లక్ష్మికుట్టి

వైద్యం

కేరళ

జోయ్ శ్రీగోస్వామి

సాహిత్యం,విద్య

అస్సోం

నారాయణ్ దాస్ మహారాజ్

ఆధ్యాత్మికం

రాజస్థాన్

ప్రవాకర మహారాణా

శిల్ప కళ

ఒడిషా

జవేరిలాల్ మెహతా

సాహిత్యం, విద్య

గుజరాత్

కృష్ణ బీహారీ మిశ్రా

సాహిత్యం,విద్య

పశ్చిమబెంగాల్

సిసిర్ పురుషోత్తం మిశ్రా

కళ - సినిమా

మహారాష్ట్ర

ఎంఎస్. సుభాసిని మిస్త్రీ

సామాజిక సేవ

పశ్చిమబెంగాల్

కేశవ్ రావు

సాహిత్యం,విద్య

మధ్యప్రదేశ్

నా నామమాల్

యోగా

తమిళనాడు

సులగిట్టి నరసమ్మ

సామాజిక సేవ

కర్ణాటక

విజయలక్ష్మీ

కళ- జానపద సంగీతం

తమిళనాడు

గోవర్దన్ పనికా

కళలు-నేత

ఒడిషా

బాబాని చరణ్ పట్నాయక్

ప్రజా సంబంధాలు

ఒడిషా

ముర్లీకాంత్ పెటేకర్

క్రీడలు-ఈత

మహారాష్ట్ర

ఎం. రాజగోపాల్

వైద్యం

కేరళ

సాంపత్ రామ్టేకే (మరణానంతరం)

సామాజిక సేవ

మహారాష్ట్ర

చంద్ర శేఖర్ రాత్

సాహిత్యం,విద్య

ఒడిషా

రాథోర్

సివిల్ సర్వీస్

గుజరాత్

అమితావ రాయ్

సైన్‌‌స అండ్ ఇంజినీరింగ్

పశ్చిమబెంగాల్

ఆర్ సత్యనారాయణ

కళలు

కర్ణాటక

పంకజ్ ఎం షా

వైద్యం

గుజరాత్

భజ్జ శ్యాం

కళలు-పెయింటింగ్

మధ్యప్రదేశ్

మహారావు రఘువీర్ సింగ్

సాహిత్యం,విద్య

రాజస్థాన్

కిదాంబి శ్రీకాంత్

క్రీడలు-బ్యాడ్మింటన్

ఆంధ్రప్రదేశ్

ఇబ్రహీం సుతర్

కళలు-సంగీతం

కర్ణాటక

సిద్ధేశ్వర స్వామిజీ

ఆధ్యాత్మికం

కర్ణాటక

లెంటినో థాకర్

సామాజిక సేవ

నాగాలాండ్

విక్రం చంద్ర ఠాకూర్

సైన్స్ అండ్ ఇంజినీరింగ్

ఉత్తరాఖండ్

రుద్రపట్నం నారాయణ స్వామి

కళలు-సంగీతం

కర్ణాటక

థరంథన్ రుద్రపట్నం నారాయణ స్వామి

కళలు-సంగీతం

కర్ణాటక

త్యాగరాజన్ నెయెన్ టీన్ థిన్

ఆధ్యాత్మికం

వియత్నాం

భగీరత్ ప్రసాద్ త్రిపాఠి

సాహిత్యం,విద్య

ఉత్తరప్రదేశ్

రాజగోపాలన్ వాసుదేవన్

సైన్స్ అండ్ ఇంజినీరింగ్

తమిళనాడు

మనస్ బిహారీ వర్మ

సెన్స్ అండ్ ఇంజినీరింగ్

బిహార్

పనతవేనే గంగాధర్

సాహిత్యం, విద్య

మహారాష్ట్ర

రోములస్ విటేకర్

జంతు సంరక్షణ

తమిళనాడు

బాబా యోగేంద్ర

కళలు

మధ్యప్రదేశ్

ఎ జాకియా

సాహిత్యం, విద్య

మిజోరం



పద్మశ్రీకి ఎంపికైన విదేశీయులు

జోస్ మా జోయ్

వ్యాపారం

ఫిలిప్పీన్స్

బౌన్లాప్ కీకోంగ్న

ఆర్కిటెక్చర్

లావోస్

రామ్లీ బిన్ ఇబ్రహీం

కళలు-నృత్యం

మలేషియా

టామీ కో

ప్రజాసంబంధాలు

సింగపూర్

హన్ మెనీ

ప్రజా సంబంధాలు

కంబోడియా

నౌఫ్ మర్వాయ్

యోగా

సౌదీ అరేబియా

టోమియో మిజోకిమి

సాహిత్యం,విద్య

జపాన్

సోమ్డెట్ ఫ్రా మహా

ఆధ్యాత్మికం

థాయిలాండ్

డా. థాంట్ మైఇంట్ - యు

ప్రజా సంబంధాలు

మయన్మార్

ఐ న్యామన్ నౌటా

శిల్పకళ

ఇండోనేషియా

మాలై హాజీ అబ్దుల్లా బిన్ మాలయ్ హజి ఓథ్‌మన్

సామాజిక సేవ

బ్రూనే, దారుస్సలాం

హబీబుల్లో రాజాబోవ్

సాహిత్యం, విద్య

తజికిస్తాన్

సందుక్ రూట్

వైద్యం

నేపాల్

పీడీఎఫ్ కోసం క్లిక్ చేయండి


795 మంది పోలీసు అధికారులకు పతకాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 795 మంది పోలీసు అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. ఇందులో 107 మంది అధికారులకు శౌర్య పతకాలు, 75 మందికి రాష్ట్రపతి పతకాలు, 613 మంది అధికారులకు విశిష్ట సేవా పతకాలు దక్కాయి.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురికి శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు, 13 మందికి విశిష్ట సేవా పతకాలు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు, 14 మందికి విశిష్ట సేవా పతకాలు దక్కాయి.

జ్యోతి ప్రకాశ్ నిరాలాకు అశోక్ చక్ర’
ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడైన వైమానిక దళం గరుడ్ కమాండో జ్యోతి ప్రకాశ్ నిరాలాకు కేంద్రం ‘అశోక్ చక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మందికి రాష్ట్రపతి సాహస పురస్కారాలను ప్రకటించారు. కీర్తి చక్ర పురస్కారాన్ని మేజర్ విజయంత్ బిస్త్‌కు ప్రకటించారు. ప్రకటించిన పురస్కారాల్లో.. 14 శౌర్య చక్ర, 28 పరమ్ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్‌‌ధ సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించారు.

బ్రూనో మార్స్‌కు ఆరు గ్రామీ అవార్డులు
గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో ఈ ఏడాది బ్రూనో మార్స్ ఆరు గ్రామీలను గెలుచుకొని టాపర్‌గా నిలిచాడు. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, రికార్డర్ ఆఫ్ ద ఇయర్, సాంగ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను బ్రూనో మార్స్ గెలుచుకున్నాడు. కెండ్రిక్ లామర్‌కు ఐదు గ్రామీలు దక్కాయి. ద వార్ ఆన్ డ్రగ్‌‌సకు బెస్ట్ రాక్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. కెండ్రిక్ లామర్‌కు చెందిన డామ్ ఆల్బమ్‌కు బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ అవార్డు దక్కింది. న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జనవరి 29న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. బెస్ట్ సోలో పెర్ఫార్మెన్స్ కెటగిరీలో పాప్‌స్టార్ ఎడ్ షీరన్ గ్రామీ దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: గ్రామీ మ్యూజిక్ అవార్డులు - 2018
ఎప్పుడు : జనవరి 29
ఎక్కడ : బ్రూనో మార్స్‌కు ఆరు గ్రామీలు

షారుఖ్ ఖాన్‌కు క్రిస్టల్ అవార్డు
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ జనవరి 22న దావోస్‌లో 24వ క్రిస్టల్ అవార్డు అందుకున్నారు. భారత్‌లో మహిళలు, బాలల హక్కుల దిశగా షారుఖ్ చేస్తున్న సేవలను గుర్తించి వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)ఈ పురస్కారం అందించింది. షారుఖ్‌తోపాటు మ్యుజీషియన్ ఎల్టన్‌జాన్, హాలీవుడ్ నటి కేట్ బ్లాంచెట్‌లకు ఈ అవార్డు దక్కింది. బ్లాంచెట్ శరణార్థుల పరిరక్షణకు కృషి చేయగా; ఎల్టన్ జాన్ ఎయిడ్స్ పౌండేషన్‌లో పనిచేశారు. ఈ అవార్డును సామాజిక సేవలో పాల్గొంటున్న కళాకారులకు అందిస్తారు.

18 మంది బాలలకు సాహస అవార్డులు
గ్యాంబ్లింగ్, బెట్టింగ్ దందా నడుపుతున్న ముఠాను పట్టుకోవటంలో పోలీసులకు సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నజియా(18)తోపాటు 18 మంది బాలలు ఈ ఏడాది సాహస అవార్డులకు ఎంపికయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్(ఐసీసీడబ్ల్యూ) ఇచ్చే ఈ అవార్డులకు ఐదు విభాగాల కింద బాలలను ఎంపిక చేస్తారు. వీటిలో అత్యున్నతమైన ‘భారత్ అవార్డు’కు నజియా ఎంపికైంది. ఈమెకు దుండగుల నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. అయినా లక్ష్యపెట్టకుండా తమ ప్రాంతంలోని గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ముఠా ఆటకట్టించగలిగింది. కర్ణాటకకు చెందిన నేత్రావతి ఎం.చవాన్ నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలురను రక్షించే క్రమంలో నీట మునిగి చనిపోయింది. ఈమెకు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించారు. కాల్వలో పడి పోయిన స్కూల్ బస్సు నుంచి 15 మంది బాలలను కాపాడిన అదే బస్సులో ఉన్న పంజాబ్‌నకు చెందిన విద్యార్థి కరణ్‌బీర్ సింగ్(17) కూడా ఎంపికయ్యాడు. జనవరి 24వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వీరంతా ప్రధాని చేతుల మీదుగా పతకాలు అందుకుంటారు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న అనంతరం వీరందరికీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ విందు ఇస్తారు.

‘ఫేక్ న్యూస్’ అవార్డుల్ని ప్రకటించిన ట్రంప్
తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని మీడియా సంస్థలకు ‘ఫేక్ న్యూస్ అవార్డుల్ని’ ప్రకటించారు. ఈ ఫేక్ న్యూస్ అవార్డుల జాబితాలో ద న్యూయార్క్ టైమ్స్ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించాక.. ‘ఇక దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నటికీ కోలుకోదు’ అని ఆ పత్రిక వెలువరించిన కథనానికి మొదటి బహుమతి ప్రకటించారు. ఏబీసీ న్యూస్, సీఎన్‌ఎన్, టైమ్ మ్యాగజైన్, వాషింగ్టన్ పోస్టులు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ‘అత్యంత అవినీతి, నిజాయతీ లేని’ మీడియా కథనాలకు వీటిని అందజేస్తున్నామని ట్రంప్ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
2016 అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేలా రష్యాతో ట్రంప్ వర్గం కుమ్మకైందా? అన్న అంశంపై వెలువడ్డ కథనాలకే ఈ జాబితాలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఈ అవార్డుల్ని రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఫేక్ న్యూస్’ అవార్డుల ప్రకటన
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

మేటి మహిళలను సత్కరించిన కేంద్ర ప్రభుత్వం
వివిధ రంగాల్లో విశేష కృషి చేసి అరుదైన విజయాలు నమోదు చేసిన మహిళలను కేంద్రం పురస్కారాలతో సత్కరించింది. క్రీడా, వైద్య, ఆరోగ్య, రక్షణ, విమానయాన, పరిశ్రమ, సినీ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తించి మొత్తం 112 మంది మహిళలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి భవన్‌లో జనవరి 20న నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా వీరంతా అవార్డులను అందుకున్నారు.
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళ పీవీ సింధు, ప్రపంచ టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో నంబర్ వన్ స్థానం సాధించిన మొదటి భారత క్రీడాకారిణి సానియా మిర్జా, ప్రపంచ మహిళా క్రికెట్‌లో తొలిసారిగా 6000 పరుగులు పూర్తిచేసిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్, ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి భారత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తొలి మహిళా అధ్యక్షురాలు, శోభన కామినేని, బ్రిటీష్ పార్లమెంటు ద్వారా హౌస్ ఆఫ్ కామన్‌‌స గౌరవాన్ని పొందిన తొలి భారతీయ గాయకురాలు కేఎస్ చిత్ర, హైదరాబాద్‌కు చెందిన తొలి మహిళా మ్యూజిక్ టెక్నీషియన్ సాజిదా ఖాన్ పురస్కారాలు అందుకున్నారు.

63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జనవరి 20న ముంబైలో జరిగింది. 2017 సంవత్సరానికిగాను ప్రదానం చేసిన ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘హిందీ మీడియం’ ఎంపికైంది. ఉత్తమ నటుడి అవార్డును ఇర్ఫాన్ ఖాన్ దక్కించుకోగా, తుమ్హారి సులు’ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటిగా విద్యాబాలన్ నిలిచింది. విద్యాబాలన్‌కు ఇది ఆరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం
ఎప్పుడు : జనవరి 20
ఎక్కడ : ముంబై
ఎవరు : ఉత్తమ నటుడు ఇర్ఫాన్‌ఖాన్, ఉత్తమనటి విద్యాబాలన్

ఢిల్లీ యువతికి ఫ్రాన్స్ అత్యున్నత కల్చరల్ పురస్కారం
దేశ రాజధాని న్యూఢిల్లీకి చెందిన ఐశ్వర్య టిప్నిస్ ఫ్రాన్స్ అత్యున్నత కల్చరల్ పురస్కారానికి ఎంపికైంది. కన్జర్వేటివ్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న ఐశ్వర్య.. ఇరుదేశాల మధ్య చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడంలో చేస్తున్న కృషికిగాను ఈ పురస్కారానికి ఎంపికైంది. ఇండియాలో ఫ్రాన్‌‌స అంబాసిడర్ అలెగ్జాం డ్రె జిగ్లేర్ కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్ పూర్వ విద్యార్థి అయిన ఐశ్వర్య... విద్యాభ్యాసం ముగిసిన తర్వాత, భారత్‌లో విదేశీ సంస్కృతి పరిరక్షణపై దృష్టిసారించారు. ఇందుకుగాను ఆమె ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

‘సుంకిరెడ్డి’కి రంగినేని పురస్కారం
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏటా అందించే ‘రంగినేని ఎల్లమ్మ’సాహిత్య పురస్కారం-2017 ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన ‘తావు’ పుస్తకానికి దక్కింది. ఈ విషయాన్ని అవార్డు కమిటీ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు జనవరి 12న ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రంగినేని సుజాత, మోహన్‌రావు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అందించే ఈ పురస్కారాన్ని ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమంలో అందిస్తామని అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ తెలిపారు. పుష్కర కాలంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాన్ని కథకులకు, కవులకు అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘రంగినేని ఎల్లమ్మ’ సాహిత్య పురస్కారం - 2017
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : ‘తావు’ పుస్తకం, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి

అజిజ్ అన్సారీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు
లాస్ ఏంజెల్స్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డులు - 2018 ప్రదానోత్సవంలో భారత సంతతి నటుడు అజిజ్ అన్సారీ.. టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ద మాస్టర్ ఆఫ్ నన్ కామిడీ సిరీస్‌లో అజిజ్ అన్సారీ నటించాడు. 2016లోనూ ఇదే సిరీస్ కోసం అన్సారీ నామినేట్ అయినా అవార్డు రాలేదు.

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం
హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘ఐఎంఏ డాక్టర్ ఎంజీ గార్గ్ జీవిత సాఫల్య పురస్కారం’లభించింది. ముంబైలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా డిసెంబర్ 28న ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెయి్యమంది ప్రసిద్ధ వైద్యులు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి






















































#Tags