Sreejesh: భార‌త హాకీ గోల్ కీప‌ర్ శ్రీజేష్‌కు రూ.2 కోట్ల భారీ నజరానా..

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భార‌త పురుషుల హాకీ జ‌ట్టు కాంస్య పత‌కం సాధించింది.

ఇందులో కీల‌క పాత్ర పోషించిన గోల్ కీప‌ర్ పీఆర్ శ్రీజేష్‌కు కేర‌ళ ప్ర‌భుత్వం రూ.2 కోట్ల న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 21వ తేదీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

‘భారత హాకీ జట్టులో సభ్యుడు, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన శ్రీజేశ్‌కు రెండు కోట్ల రూపాయలు బహుమతిగా అందిస్తున్నాం’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. 

ప్యారిస్‌లో భార‌త హాకీ జట్టు కాంస్య ప‌త‌కం సాధించ‌డంలో శ్రీజేష్‌ది కీల‌క పాత్ర‌. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీజేష్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్‌ బ్రిటన్‌కు ఎక్స్‌ట్రా గోల్‌ చేసే ఛాన్స్‌ ఇవ్వలేదు. కాగా తన 18 ఏళ్ల కెరీర్‌లో శ్రీజేష్‌ భారత్‌ తరఫున 336 మ్యాచ్‌లు ఆడాడు.

సుదీర్ఝ కాలంగా జ‌ట్టులో కీల‌క‌పాత్ర పోషించిన శ్రీజేష్ ప్యారిస్ క్రీడ‌ల్లో భార‌తీయ జ‌ట్టు కాంస్య ప‌త‌కం గెలిచాక అంత‌ర్జాతీయ హాకీకీ విడ్కోలు ప‌లికాడు.

Smriti Mandhana: వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధానకి మూడో ర్యాంక్‌

#Tags