Indian Grand Prix–3: స్వర్ణ పతకం నెగ్గిన జ్యోతిక శ్రీ

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–3 అథ్లెటిక్స్‌ మీట్‌లో జ్యోతిక శ్రీ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది.

బెంగళూరులో జూన్ 12వ తేదీ జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి–3 అథ్లెటిక్స్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దండి జ్యోతిక శ్రీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి మహిళల 400 మీటర్ల రేసులో స్వర్ణ పతకం సాధించింది.

జ్యోతిక శ్రీ 400 మీటర్లను అందరికంటే వేగంగా 51.53 సెకన్లలో పూర్తి చేసి తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది. తమిళనాడుకు చెందిన శుభా వెంకటేశ్ 52.34 సెకన్లతో రెండో స్థానంలో, కర్ణాటకకు చెందిన పూవమ్మ రాజు 52.62 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలుగ‌మ్మాయి ఈమెనే..

#Tags