ICC Players: ఐసీసీ అవార్డులో సత్తాచాటిన శ్రీలంక ప్లేయర్స్!
తాజాగా ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సెప్టెంబర్ 16వ తేదీ ప్రకటించింది. ఈ అవార్డులలో శ్రీలంక ప్లేయర్స్ సత్తాచాటారు.
పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు కూడా శ్రీలంకకే దక్కడం గమనార్హం. మెన్స్ కేటగిరీలో లంక యువ స్పిన్ సంచలనం దునీత్ వెల్లలాగే, మహిళల క్రికెట్ విభాగంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు అందుకున్న ఐదో లంక ఆటగాడిగా దునీత్ నిలిచాడు.
ఈ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఉన్నారు. మరోవైపు లంక మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐర్లాండ్ పర్యటనలో అదరగొట్టింది.
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా..