Archery Senior Nationals: ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న‌ ధీరజ్, దీపికా కుమారి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ జాతీయ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచాడు.

డిసెంబర్ 20వ తేదీ జరిగిన రికర్వ్‌ సింగిల్స్‌ ఫైనల్లో ధీరజ్‌ 6–2తో హరియాణాకు చెందిన దివ్యాన్ష్‌ చౌధరిని ఓడించి విజయం సాధించాడు.

ఫైనల్లో మొదటి రెండు సెట్‌లలో వెనుకబడిన ధీరజ్‌ తరువాత మంచి ప్రదర్శన కనబరిచి పతకం గెలుచుకున్నాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అతుల్‌ వర్మ కాంస్యం సాధించాడు.

మహిళల విభాగంలో.. నాలుగు సార్లు ఒలింపియన్‌ దీపికా కుమారి చాంపియన్‌గా నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో తన సహచర ఆర్చర్‌ అకింత భకత్‌పై విజయం సాధించి ఆమె పసిడి పతకం గెలిచింది.

సిమ్రన్‌జీత్‌ కౌర్‌ కాంస్యం సాధించింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో దీపికా కుమారి తన భర్త అతాను దాస్‌తో కలిసి స్వర్ణ పతకం గెలుచుకుంది. పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టు తరఫున పోటీ చేసి, ఫైనల్లో పంజాబ్‌ జట్టును 6–2తో ఓడించి విజయం సాధించింది.

Junior Hockey Asia Cup: వరుసగా రెండోసారి.. జూనియర్‌ హాకీ ఆసియా కప్ భారత్‌దే..

#Tags