ISRO Space: ఇస్రో అంతరిక్ష వారోత్సవాలు
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షార్‌లో అక్టోబర్ 4న తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అక్టోబర్ 5న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, పుదుచ్చేరిలో అక్టోబర్ 7న తెలంగాణతోపాటు ఆ రాష్ట్ర ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై, ఒడిశాలోని కటక్‌లో అక్టోబర్ 12న అక్కడి గవర్నర్ గణేశిలాల్ ప్రారంభించనున్నారు. వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విజయవాడ, శ్రీహరికోట, పుట్టపర్తి, తమిళనాడులోని వేలూరు, ఒడిశాలోని కటక్, పుదుచ్చేరిలోని కరైకల్‌లో నిర్వహిస్తారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP