ISRO: మూడు ఇస్రో ప్రాజెక్టులు జాతికి అంకితం

సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్‌ ప్రయోగాల నిమిత్తం సుమారు రూ.1,800 కోట్లతో నిర్మించిన మూడు ఇస్రో సెంటర్లను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ తుంబా నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్‌ భవనం, ఇస్రో ప్రపొల్షన్‌ కాంప్లెక్స్‌లో సెమీ క్రయోజనిక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంజన్‌ అండ్‌ స్టేజ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ భవనం, విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో ట్రైనోసిక్‌ విండ్‌ టన్నెల్‌ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా ఏటా 8 నుంచి 15 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

Amrit Bharat Stations: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవే..

#Tags