ISRO: పుష్పక్‌గా పిలువబడే.. పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్

గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారీ విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ప్రకటించింది.

ఈ పరీక్ష రీ యూజబుల్‌ లాంఛ్‌ వెహికల్‌(ఆర్‌ఎల్‌వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సాధించిందని మరోసారి నిరూపించింది.

పుష్పక్‌గా పిలువబడే ఈ ఆర్‌ఎల్‌వీ ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా ఖచ్చితంగా రావడం, ల్యాండింగ్‌ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్‌ అవడం వంటి పరామితులను ఖచ్చితత్వంతో సాధించింది. ల్యాండింగ్‌ ఎక్స్‌పరిమెంట్ (ఎల్‌ఈఎక్స్‌–03) సిరీస్‌లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని జూన్ 23వ తేదీ కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో జరిపారు.

Anti Radiation Missile: యాంటీ రేడియేషన్‌ మిసైల్‌.. ‘రుద్ర ఎమ్‌-2’ పరీక్ష విజయవంతం

మొదట పుష్పక్‌ను భారత వాయుసేకు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌లో రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్‌వే వైపు ఖచ్చితత్వంతో దూసుకొచ్చి అతి గాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్‌ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్‌ సమయంలో దాని వేగం గంటకు 320 కి.మీ.లు పెరిగింది.

సాధారణంగా ల్యాండింగ్‌ జరుగుతున్నపుడు వాణిజ్య విమానం గంటకు 260 కి.మీ.లు, యుద్ధవిమానమైతే గంటకు 280 కి.మీ.ల వేగంతో ల్యాండ్‌ అవుతాయి. ల్యాండ్‌ కాగానే బ్రేక్‌ పారాచూట్‌ విచ్చుకోవడంతో పుష్పక్‌ వేగం గంటకు 100 కి.మీ.లకు తగ్గిపోయింది. ల్యాండింగ్‌ గేర్‌ బ్రేకులు వేయడంతో పుష్పక్‌ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్‌ స్వయంచాలిత రడ్డర్, నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది.

NISAR Mission: హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే ప్రయత్నం!

#Tags