POEM-4 in PSLV-C60: పీఎస్ఎల్‌వీ సీ60లో పీఎస్-4తో విభిన్న ప్రయోగాలు
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి డిసెంబర్ 30వ తేదీ ప్రయోగించనున్న పీఎస్ఎల్‌వీ సీ60 ప్రయోగంలో పీఎస్-4 ఆర్బిటల్ ఎక్స్‌పరమెంటల్ మాడ్యూల్ దశతో విభిన్న పరిశోధనలను చేసేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.
రాకెట్‌లోని శిఖర భాగంలో అమర్చే పీఎస్-4 ఆర్బిటల్ ఎక్స్‌పరమెంటల్ మాడ్యూల్లో 24 పేలోడ్స్ (ఉపకరణాలు) అమర్చి పంపిస్తున్నారు. ఇందులో 14 పేలోడ్స్ ఇన్‌స్రోటాస్‌కు, 10 పేలోడ్స్ఇన్ ద్వారా ప్రభుత్వేతర స్టార్టప్ కంపెనీలు వారు సమకూర్చారు.
పీఎస్-4 ఆర్బిటల్ ఎక్స్‌పరమెంటల్ మాడ్యూల్ మూడు నెలలు పాటు నిర్దిష్ట కక్ష్యలో ఉండి మైక్రోగ్రా విటీ ప్రయోగాలకు ఉపయోగపడేలా చేస్తుంది. పీఎస్ఎల్వీ రాకెట్లలో పీఎస్-4 ఆర్బిటల్ ఎక్స్‌పరమెంటల్ మాడ్యూల్లో ఇది నాలుగో ప్రయోగమని ఇస్రో తెలిపింది.
అయితే రాకెట్‌లోని నాలుగో దశలో అమర్చే ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టాక పీఎస్-4ను మండించి అనేక ఎక్సపరమెంటల్స్ చేయడానికి ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు.
#Tags