IIT Madras: కచ్చితమైన గర్భధారణ వయసుకు.. ఐఐటీ మద్రాస్‌ ఏఐ మోడల్‌

గర్భిణిలో పెరుగుతున్న పిండం కచ్చితమైన వయసును నిర్ధారించేందుకు.. ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) మోడల్‌ను అభివృద్ధి చేశారు. గర్భిణి విషయంలో సరైన సంరక్షణ, కచ్చితమైన డెలివరీ తేదీ నిర్ణయించేందుకు గర్భధారణ వయసు(జీఏ)అవసరం. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్‌ను ‘గర్భిణి–జీఏ2’ గా పిలుస్తున్నారు. ప్రత్యేకంగా భారతీయులను దృష్టిలో పెట్టుకుని ఈ నమూనా(గర్భిణి–జీఏ2)ను అభివృద్ధి చేశారు. ఇది భారతీయ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత కచ్చితమైన గర్భధారణ వయసును అంచనా వేస్తుంది. అంతేకాదు, గతంలో తలెత్తిన దోషాలను మూడు రెట్లు తగ్గిస్తుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags