Abhyas: మానవరహిత విమానం ‘అభ్యాస్’ ను పరీక్షించిన దేశం?

గగనతలంలో వివిధ అస్త్రాలకు లక్ష్యంగా ఉపయోగపడే ‘హై స్పీడ్‌ ఎక్సెపెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌’ (హీట్‌)ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అక్టోబర్ 22న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) నుంచి ఈ ప్రయోగం జరింగింది. ఈ మానవరహిత విమానానికి ‘అభ్యాస్‌’ అని పేరు పెట్టారు. దీన్ని వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆకాశంలో ఒక లక్ష్యంగా వాడొచ్చు. బెంగళూరులో ఉన్న డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) దీన్ని అభివృద్ధి చేసింది.

చ‌ద‌వండి: ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అమర్చారు?

క్విక్‌ రివ్యూ   :

ఏమిటి    : మానవరహిత విమానం ‘అభ్యాస్’ ను పరీక్షించిన దేశం?

ఎప్పుడు  : అక్టోబర్ 22

ఎవరు     : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)

ఎక్కడ    : ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌), చాందీపూర్‌, ఒడిశా

ఎందుకు  : గగనతలంలో వివిధ అస్త్రాలకు లక్ష్యంగా వినియోగించేందుకు...

 

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి:

తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...

డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags