Anti Microbial Vaccine: భారత్‌ బయోటెక్‌ నుంచి ‘ఏవీ0328’ వ్యాక్సిన్‌

భారత్‌ బయోటెక్‌ కంపెనీ మరో సరికొత్త వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు సిద్ధమైంది.

యాంటీ బ్యాక్టీరియల్‌ వ్యాక్సిన్‌ ‘ఏవీ0328’ అభివృద్ధి, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం అమెరికాకు చెందిన కంపెనీ అలోపెక్స్‌.ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఒప్పందం ప్రకారం.. వన్‌టైమ్‌ ముందస్తు చెల్లింపు, మైలురాయి చెల్లింపులకు అలోపెక్స్‌కు అర్హత ఉంటుంది. అలాగే లైసెన్స్ పొందిన భూభాగాల్లో ‘ఏవీ0328’ వ్యాక్సిన్‌ భవిష్యత్తు అమ్మకాలపై రాయల్టీలను పొందుతుంది.

‘వ్యాక్సినేషన్ ద్వారా యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను తగ్గించే పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ సహకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి సురక్షితమైన, చవకైన, అధిక-నాణ్యత గల వ్యాక్సిన్‌లను అందించాలనే మా మిషన్‌కు అనుగుణంగా ఉంటుంది’ అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు.

ఫేజ్-I ఫస్ట్-ఇన్-హ్యూమన్ ట్రయల్ పూర్తయిందని, ‘ఏవీ0328’ వ్యాక్సిన్‌ ఎటువంటి తీవ్రమైన ప్రతికూల సంఘటనలనైనా బాగా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. 

Oral Cholera Vaccine: మరణాలు తగ్గించడానికి.. భార‌త్ బయో నుంచి ఓర‌ల్ క‌ల‌రా వ్యాక్సిన్

#Tags