Asteroid: భూమి సమీపంలోకి రాబోతున్న భారీ గ్రహశకలం..

ఏకంగా 70 అంతస్తుల భవనం అంత ఎత్తున్న భారీ గ్రహశకలం అక్టోబ‌ర్ 28వ తేదీ భూమి సమీపానికి రాబోతోంది.

సైంటిస్టులు దీనికి 'అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ' అని పేరుపెట్టారు. ఈ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'కు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్(జేపీఎల్) తొలుత గుర్తించింది.

ఇది.. భూమికి 3.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి రాబోతోంది, భూమి-చంద్రుడు మధ్య దూరానికి 9 రెట్లు అధికం. సైంటిస్టులు దీనిని సమీపం నుంచి పరిశీలించవచ్చని, కానీ భూమికి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. ఇది సెకన్కు 9.43 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని, సమీపం నుంచే క్షుణ్నంగా పరిశీలించవచ్చని అంటున్నారు. 

ఇదొక అరుదైన అవకాశమని చెబుతున్నారు. భవిష్యత్తులో భూమికి సమీపంలోకి రాబోయే గ్రహ శకలాలు, వాటి నుంచి వాటిల్లే ముప్పు, ఆ ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ' రాకను ఉపయోగించుకుంటామని సైంటిస్టులు వెల్లడించారు.

Mini Moon: త్వరలో భూ కక్ష్యలోకి బుల్లి గ్రహశకలం.. రెణ్నెల్లపాటు భూమి చుట్టూ చక్కర్లు

#Tags