Vizag City Police: తొలిసారిగా బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు.. కేసు నమోదు

విశాఖ సిటీ: రాష్ట్రంలో తొలిసారిగా ఒక దివ్యాంగుడు బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ నగర పోలీసులు కేసు నమోదు చేశారు.

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. దిశ దివ్యాంగ్‌ సురక్ష ద్వారా ప్రతి నెలా 2, 15 తేదీల్లో దివ్యాంగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

బ్రెయిలీ లిపిలో ఫిర్యాదులు స్వీకరించేందుకు అందులో పరిజ్ఞానం ఉన్నవారిని నియమించారు. మార్చి 15వ తేదీన తొలిసారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు డయల్‌ యువర్‌ సీపీకి ఫోన్‌ చేశాడు.

చదవండి: Success Story : దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా డిజిటల్‌ విధానంలో పరీక్ష రాసి.. పాసైన విద్యార్థులు వీరే..

అధిక లాభాలు ఇస్తానని చెప్పి బిర్లా జంక్షన్‌ ప్రాంతంలో ఉన్న క్రేసుల్లా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తన వద్ద రూ.2.9 లక్షలు, కాకినాడకు చెందిన తన స్నేహితుడు పిప్పర వెంకటేశ్వరరావు నుంచి రూ.11 లక్షలు తీసుకుని మోసం చేసిందని చెప్పారు.

అతడి ఫిర్యాదును బ్రెయిలీ లిపిలో నమోదు చేశారు. ఆ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు చీటింగ్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

#Tags