Bhu Bharati Act: తెలంగాణలో.. 'భూభారతి'కి గవర్నర్ ఆమోదం
ఈ బిల్లును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. తద్వారా భూభారతి చట్టంగా అమల్లోకి రానుంది. జనవరి 9వ తేదీన భూభారతి బిల్లును రేవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ రాష్ట్ర రేవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస రెడ్డికి సచివాలయంలో అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఒకటి రెండు రోజుల్లో గెజిట్‌లో ప్రచురించనుంది. అయితే, భూభారతి చట్టం ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందో ప్రభుత్వ తరఫున ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సి ఉంటుంది.
ఇది అమల్లోకి రావడానికి మార్గదర్శకాల రూపకల్పన ప్రొసెస్ కూడా జరుగుతోంది. రేవెన్యూ శాఖ ఈ మార్గదర్శకాలను తయారుచేసేందుకు మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తోంది. అంచనా ప్రకారం మార్గదర్శకాలు సిద్ధం అయ్యే సమయం మరో నెల రోజులు పడుతుందని తెలిపారు. మార్గదర్శకాలు సిద్ధం అవగానే చట్టం అమల్లోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Green Energy: ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ’కి.. 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ