National Food Security Act: ఆహారభద్రతలో 3వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ

Telangana Food security

ఆహార భద్రత అమలులో జనరల్‌ కేటగిరీ రాష్ట్రాల్లో 0.794తో ఏపీ మూడోస్థానం,  0.743 స్కోరుతో తెలంగాణ 12వ స్థానంలో నిలిచాయి. 0.836 స్కోరుతో తొలి స్థానంలో ఒడిశా, 0.797 స్కోరుతో యూపీ రెండో స్థానంలో నిలిచాయి. జాతీయ ఆహార భద్రత చట్టం రాష్ట్రాల ర్యాంకింగ్‌ ఇండెక్స్‌ను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రి పీయూష్‌ గోయల్‌ జూలై 5న విడుదల చేశారు. ఈ సందర్భంగా గోయల్‌ మాట్లాడుతూ.. రేషన్‌కార్డు దారుడు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రేషన్‌ తీసుకొనే స్వేచ్ఛను కల్పించడంతో 45వేల కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈ పథకం వలసదారులకు ఎంతో ఉపకరిస్తోందన్నారు. 

Also read: Conocarpus plants దడ పుట్టిస్తున్న మడజాతి కోనోకార్పస్‌ మొక్కలు

#Tags