Skoch Awards: ఏపీకి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు

ఏపీలో సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తం ఆరు స్కోచ్‌ అవార్డులు దక్కాయి.

డిసెంబ‌ర్ 19న ఢిల్లీలో స్కోచ్‌ గ్రూప్‌ నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు రాష్ట్రానికి స్కోచ్‌ అవార్డు లభించింది. గుడ్‌ గవర్నెన్స్‌ అండ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కేటగిరీలో 2021–22కి ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆదాయాలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను స్కోచ్‌ సంస్థ రాష్ట్రాన్ని గోల్డ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. సెర్ప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీనిధి సంస్థ బ్యాంకులతోపాటు పొదుపు సంఘాల మహిళలకు అదనంగా, అత్యంత సులభ విధానంలో 48 గంటల్లోనే బ్యాంకు రుణాలను అందిస్తోంది. ఇందుకుగాను స్కోచ్‌ మరో గోల్డ్‌ అవార్డును ప్రకటించింది.  గ్రామీణాభివృద్ధి శాఖకు 5 స్కోచ్‌ అవార్డులు దక్కాయి.

Weekly Current Affairs (International) క్విజ్ (18-24 నవంబర్ 2022)

#Tags