Araku coffee: అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి

సాక్షి, అమరావతి: అరకు కాఫీ ఘుమఘుమలు మరో­సా­రి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ప్రపంచంలోనే తొలి గిరిజన సంప్రదాయ కాఫీ అయిన అరకు కాఫీ ఇండియన్‌ గ్రేట్‌ బ్రాండ్లలో ఒకటి అంటూ నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్వీట్‌ చేయగా.. దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేశారు. దీంతో మరోసారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్‌ వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది.
Araku coffee

ఇండియాలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో విదేశీ ప్రతినిధులకు అందంగా ప్యాక్‌ చేసిన అరకు కాఫీని అందిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే తొలి గిరిజన కాఫీగా గుర్తింపు పొందిందంటూ అమితాబ్‌ కాంత్‌ కీర్తించారు.   సేంద్రియ సాగు పరీక్షలో స్థిరంగా 90 కంటే ఎక్కువ మార్కులు సాధిస్తూ తొలి ఇండియన్‌ కాఫీగా నిలవడమే కాకుండా.. గ్రేట్‌ ఇండియన్‌ బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. ఈ ట్వీట్‌పై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. దేశ విజయాన్ని అద్దం­పట్టేలా అరకు కాఫీని ఎంచుకోవడం అద్భు­తమైన నిర్ణయమంటూ పొగిడారు. అర­కు కాఫీ గ్లోబల్‌ బ్రాండ్‌గా మారుతూ  గిరిజనుల జీవితాల్లో  మార్పులు తెస్తోందన్నారు.

చ‌ద‌వండి: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన 'యూపీఐ’..

చ‌ద‌వండి: ​​​​​​​తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు?

#Tags