Mulapeta Port: మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన.. పోర్టు విశేషాలివే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులకు ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహ‌న్ రెడ్డి భూమి పూజ చేశారు.

23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్‌ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు.
విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. 

Aquarium In Hyderabad: హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద టన్నెల్‌ ఆక్వేరియం..!

మరికొన్ని ప్రాజెక్టులకు శ్రీకారం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా ఏప్రిల్ 19న‌ సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్‌ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. కాగా సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. 
మూలపేట పోర్టు విశేషాలు
☛ పోర్టు సామర్థ్యం ఏడాదికి 23.5 మిలియన్‌ టన్నులు
☛ బెర్తుల సంఖ్య 4
☛ ఎన్‌హెచ్‌ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ నాలుగు లైన్ల రహదారి
☛ నౌపడ జంక్షన్‌ నుంచి పోర్టు దాకా 10.6 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం
☛ గొట్టా బ్యారేజ్‌ నుంచి 50 కి.మీ. పైప్‌లైన్‌తో 0.5 ఎంఎల్‌డీ నీటి సరఫరా
☛ పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు

Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూప‌క‌ర్త‌, విగ్రహ ప్రత్యేకతలివే..

#Tags