Integrated Renewable Energy Project: ప్రపచంలో తొలి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో భారీ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఒకే యూనిట్‌ నుంచి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ (పంప్డ్‌ స్టోరేజీ) విద్యుత్‌ ఉత్పాదనకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు–ఐఆర్‌ఈపీ) ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతోంది. గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ప్రపంచంలో మూడు విభాగాల ద్వారా ఒకే యూనిట్‌ నుంచి ఇన్ని మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిచేసే తొలి ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 17న శంకుస్థాపన చేశారు.

GK Persons Quiz: రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులైనది?

ప్రపంచంలోనే అత్యధికంగా..

  • ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా(కర్నూలు జిల్లా), పాణ్యం మండలం పిన్నాపురం(నంధ్యాల జిల్లా)లలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటుచేస్తున్న.. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా అవతరిస్తోంది.
  • ఒకే యూనిట్‌ నుంచి సోలార్, పవన, హైడల్‌ పవర్‌ను ఉత్పత్తిచేసే ప్రాజెక్టు కూడా ఇదే కాబోతోంది.
  • ఈ ప్రాజెక్టులో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి 3,000 మెగావాట్లు, విండ్‌ 550 మెగావాట్లు, హైడల్‌ పవర్‌ 1,680 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసి నేషనల్‌ గ్రిడ్‌కు అనుసంధానించి ఓర్వకల్‌ పీజీసీఐఎల్‌/సీటీయూ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ద్వారా దేశంలోని డిస్కమ్‌లు, పరిశ్రమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
  • ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తిచేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించారు.

రూ.15వేల కోట్ల పెట్టుబడి..

  • ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. 
  • ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్‌ డయాక్సైడ్‌ 15 మిలియన్‌ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా.

కర్నూలులో తొలి హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు..

  • ఇంటిగ్రేటేడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు(ఐఆర్‌ఈపీ)లో భాగంగా కర్నూలులో తొలి హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. 
  • 1,680 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయ్యే హైడల్‌ వపర్‌ను పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ అని కూడా అంటారు. హైడల్‌ పవర్‌ను పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రమే చేపట్టేందుకు వీలుంటుంది.

పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ అంటే..?
కేటాయించిన స్థలంలో పైన, కింద ప్రాజెక్టులు కడతారు. విద్యుత్‌ వాడకానికి డిమాండ్‌ లేని సమయంలో నీటిని కింది నుంచి పైకి పంప్‌ చేస్తారు. విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో పైనున్న నీటిని కిందికి వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అందువలన దీనిని పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ లేదా హైడల్‌ పవర్‌ అంటారు. ఐఆర్‌ఈపీ కోసం గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు.
Grid Dynamics: దేశంలో గ్రిడ్‌ డైనమిక్స్‌ మొదటి యూనిట్‌ ఎక్కడ ఏర్పాటు కానుంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించే.. ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు–ఐఆర్‌ఈపీ)కు శంకుస్థాపన
ఎప్పుడు  : మే 17
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా(కర్నూలు జిల్లా), పాణ్యం మండలం పిన్నాపురం(నంధ్యాల జిల్లా)లలో..
ఎందుకు : ఒకే యూనిట్‌ నుంచి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ (పంప్డ్‌ స్టోరేజీ) విద్యుత్‌ ఉత్పాదనకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags