Bhavanapadu Port: భావనపాడు పోర్టు పేరు మార్పు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Bhavanapadu Port

ఈ విష‌యాన్ని రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (పోర్ట్స్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ) కరికల్ వలవెన్ వెల్ల‌డించారు. పోర్టు కోసం గ్రామాన్ని, భూములను త్యాగం చేశామని, పోర్టు పేరు తమ గ్రామం పేరు మీద‌ ఉండాలని మూలపేట, విష్ణుచ‌క్రం గ్రామ‌వాసులు గతంలో నిర్వహించిన వివిధ సమావేశాల్లో ఆ జిల్లా కలెక్టర్‌, అధికారులకు విన్నవించారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్‌ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చుతున్న‌ట్లు వలెవన్ తెలిపారు.

Andhra Pradesh: కోనసీమ జిల్లా పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..?

#Tags