TET/DSC – ప్రత్యేకం బయాలజీ Bitbank: బోధనా యూనిట్లో విషయం, పద్ధతి రెం డూ ఉంటాయని తెలిపిందెవరు?
1. బోధన ఎలా ఉండాలి, ఏ అంశాలు ఏ విధంగా బోధించాలి లాంటి విషయాల గురించి ఉపాధ్యాయుడు దేన్ని తయారు చేసుకోవాలి?
1) బ్లూ ప్రింట్
2) పాఠ్య పథకం
3) మూల్యాంకనం
4) టీచర్స్ డైరీ
- View Answer
- Answer: 2
2. విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుడు బోధించే తరగతికి లక్ష్యసాధన దిశగా తయారు చేసుకునేది?
1) వార్షిక పథకం
2) యూనిట్ పథకం
3) వార్షిక పరీక్షలు
4) బ్లూ ప్రింట్
- View Answer
- Answer: 1
3. ఉపాధ్యాయుడు తాను తీసుకోబోయే సెలవులను కూడా పరిగణనలోకి తీసుకొని కిందివాటిలో దేన్ని రూపోందించుకోవాలి?
1) వార్షిక పథకం
2) యూనిట్ పథకం
3) వార్షిక పరీక్షలు
4) బ్లూ ప్రింట్
- View Answer
- Answer: 1
4. వార్షిక పథకం వల్ల కలిగే ఒక ప్రయోజనం?
1) సెలవులను వాడుకోవచ్చు
2) సమయాన్ని ఇష్టానుసారంగా వాడుకోవచ్చు
3) రుతువులను, సహజ వనరులను ఉపయోగించి బోధించవచ్చు
4) బోధన కష్టతరంగా పూర్తి చేయవచ్చు
- View Answer
- Answer: 3
5. ఒక కేంద్రీయ ఇతివృత్తం లేదా ప్రయోజనం చుట్టూ వ్యవస్థీకరించిన కృత్యాలు, అనుభవాల అభ్యసనానికి తోడ్పడే ΄ాఠ్య విషయ భాగం?
1) పాఠ్య పుస్తకం
2) పాఠ్య ప్రణాళిక
3) యూనిట్
4) సబ్జెక్ట్
- View Answer
- Answer: 3
6. పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ లేదా ప్రమాణం అంటారని తెలిపినవారు?
1) వెస్టవే
2) కిల్‌ప్యాట్రిక్
3) బ్లూమ్స్
4) ప్రెస్టన్
- View Answer
- Answer: 4
7. బోధనా యూనిట్లో విషయం, పద్ధతి రెం డూ ఉంటాయని తెలిపిందెవరు?
1) థర్బర్, కొల్లెట్
2) ప్రెస్టన్
3) వెస్టవే
4) థామన్
- View Answer
- Answer: 1
8. మంచి యూనిట్ లక్షణాల్లో లేనిది?
1) కృత్య అనుభవం
2) త్వరగా పూర్తి చేసేది
3) భవిష్యత్ అవసరాలు
4) నిత్యజీవితంలో సంబంధం
- View Answer
- Answer: 2
9. యూనిట్ భావనలో సమగ్రమైన విషయ భావంలో ఏ సూత్రాన్ని కలిగి ఉండాలి?
1) బహు సందేశ సూత్రం
2) ద్వి సందేశ సూత్రం
3) ఏక సందేశ సూత్రం
4) పైవేవీకాదు
- View Answer
- Answer: 3
10. యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఎవరిని సంప్రదించాలి?
1) ప్రధానోపాధ్యాయుడు
2) అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు
3) జిల్లా విద్యాశాఖాధికారి
4) తెలివి కలిగిన విద్యార్థి
- View Answer
- Answer: 2
11. విద్యార్థి సాధనను కొలవవచ్చు అని తెలియజేసిన వారెవరు?
1) బ్లూమ్స్
2) జాన్ డ్యూయి
3) ప్రెస్టన్
4) గ్లేసెస్
- View Answer
- Answer: 4
12. యూనిట్ దశల్లో ప్రేరణ కలిగించడం ఏ దశకు సంబంధించింది?
1) సంగ్రహపరచడం
2) పునఃశ్చరణ
3) ప్రారంభక సోపానం
4) అభివృద్ధి పరిచే సోపానం
- View Answer
- Answer: 3
13. యూనిట్ పథకం అమలు దశల్లో మూ ల్యాంకన పద్ధతులు ఉండే సో΄ానం?
1) అభివృద్ధిæ పరిచే సోపానం
2) ఉప సంహారక సోపానం
3) ప్రారంభక సోపానం
4) సంగ్రహపరచడం
- View Answer
- Answer: 2
14. యూనిట్ పథకం వల్ల కలిగే ప్రయోజనం
1) విద్యార్థి కేంద్రీకృతం
2) బోధనతో పరీక్షలకు తయారీ
3) విద్యార్థులు స్థబ్దతతో ఉన్నా బోధించవచ్చు
4) పైవన్నీ
- View Answer
- Answer: 1
15. ఉపాధ్యాయుడు పనిచేసే తత్వం, విద్యార్థుల గురించి అతనికున్న సమాచారం,విద్యా లక్ష్యాలపై అతనికి ఉన్న అవగాహన, బోధించాల్సిన విషయం గురించి జ్ఞానం, ఫలితమైన పద్ధతులను ఉపయోగించడంలో అతని సామర్థ్యం ‘పాఠ్యపథకం’లో ఉంటాయని తెలిపిన వారెవరు?
1) థర్బర్
2) గ్లేసెస్
3) ప్రెస్టెస్
4) లెస్టర్ బి. పెండ్స్
- View Answer
- Answer: 4
16. సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు బోధించబోయే చర్య కోసం అందించిన పథకం?
1) వార్షిక పథకం
2) యూనిట్ పథకం
3) పాఠ్య పథకం
4) ఏదీకాదు
- View Answer
- Answer: 3
17. కిందివాటిలో ఉత్తమ పాఠ్య పథకానికి ఉండాల్సిన లక్షణం కానిది?
1) లక్ష్యాలను స్పష్టంగా చూపాలి
2) ఉపాధ్యాయునికి సులభతరంగా ఉండాలి
3) మూల్యాంక సాధనలను పొందుపరచాలి
4) బోధనా కృత్యాలను సూచించాలి
- View Answer
- Answer: 2
18. హెర్బార్షియన్ విధానంలో బోధనా ప్రమాణ కృత్యాలను ఎన్ని దశలుగా రూపోందించారు?
1) 4
2) 3
3) 5
4) 2
- View Answer
- Answer: 2
19. ఉపాధ్యాయుడు విషయాన్ని హాజరు పరచడం అనే ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చిన విధానం?
1) బ్లూమ్స్ మూల్యాంకన విధానం
2) హెర్బార్షియన్ విధానం
3) RCEM విధానం
4) పైవన్నీ
- View Answer
- Answer: 2
20. అప్రిసెప్టల్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్‌పై ఆధారపడి క్లాసికల్ హ్యుమన్ ఆర్గనైజేషన్ థియరీ ప్రభావం కలిగిన విధానం?
1) హెర్బార్షియన్ విధానం
2) బ్లూమ్స్ మూల్యాంకన విధానం
3) RCEM విధానం
4) పైవన్నీ
- View Answer
- Answer: 1
21. కిందివాటిలో హెర్బార్షియన్ విధానంలోని దశ ఏది?
1) వివరించడం
2) పరిశీలించడం
3) భేదాలు గుర్తించడం
4) పోలిక లేదా సంసర్గం
- View Answer
- Answer: 4
22. హెర్బార్షియన్ విధానంలో బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించిన విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని ఏ దశలో తెలుసుకుంటారు?
1) సాధారణీకరం
2) అన్వయం
3) సన్నాహం
4) హాజరుపరచడం
- View Answer
- Answer: 3
23. పాఠ్యపథక నిర్మాణంలో సమ్మిళిత కృత్యాలు అంటే?
1) ఉన్ముఖీకరణ
2) అభ్యసించిన విషయ జ్ఞానంతో సాధారణీకరణ, నియోజన
3) బోధనా విషయాన్ని హాజరు పరచడం
4) శీర్షికా ప్రకటన
- View Answer
- Answer: 2
24. అన్ని సబ్జెక్టుల బోధనకు అనుకూలమైన విధానం?
1) హెర్బార్షియన్ విధానం
2) బ్లూమ్స్ విధానం
3) RCEM విధానం
4) ఏదీకాదు
- View Answer
- Answer: 1
25. బ్లూమ్స్ విధానంలో ఎన్ని సోపానాలు ఉన్నాయి?
1) 5
2) 3
3) 4
4) 2
- View Answer
- Answer: 3
26. కిందివాటిలో బ్లూమ్స్ విధానంలో లేని దశ లేదా మూల్యాంకన ఉపగమం పాఠ్యపథక దశ కానిది?
1) విద్యా లక్ష్యాల రూపకల్పన
2) అభ్యసన అనుభవాల కల్పన
3) పునఃశ్చరణ
4) ప్రవర్తనా మార్పును మూల్యాంకనం చేయడం
- View Answer
- Answer: 3
27. హెర్బార్ట్ విధానంలో విషయ వ్యవస్థీకరణ లేదా హాజరుపరచడానికి ప్రాముఖ్యం ఇచ్చారు. బ్లూమ్స్ విధానంలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారు?
1) బోధనోపకరణ
2) అభ్యసనం
3) బోధన
4) లక్ష్యాధార కృత్యాలు
- View Answer
- Answer: 4
28. ‘ఫలవంతమైన బోధన అంటే తాను పనిచేసే వాతావరణంలోని వ్యక్తుల చేత మెప్పు పొందేలా, నిర్ధారిత ఫలితాల సాధనకు ప్రత్యేక రీతిలోని ఉ΄ాధ్యాయుని సామర్థ్యం’ అని తెలిపిన వారెవరు?
1) బిడిల్
2) హెర్బార్ట్
3) బ్లూమ్స్
4) ప్రెస్టన్
- View Answer
- Answer: 1
29. ‘సూక్ష్మంగా చెప్పాలంటే ఒక వ్యక్తి జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులు, చింతనా పద్ధతులను సం΄ాదిస్తూ, ధారణ చేస్తూ వినియోగిస్తున్నప్పుడు అతడి ప్రవర్తన ఏ ప్రక్రియ ద్వారా స్కరితమవుతుందో ఆ ప్రక్రియే అభ్యసనం’ అని నిర్వచించినవారు?
1) మన్
2) కొలిస్నిక్
3) గ్లేసెస్
4) ప్రెస్టన్
- View Answer
- Answer: 2
30. ‘చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చేసే పనులు, పరిశీలనల వల్ల ఇంచుమించు శాశ్వతంగా సంస్కరితమయ్యే ప్రక్రియే అభ్యసనం’ అని నిర్వచించిన వారు?
1) మన్
2) కొలిస్నిక్
3) గ్లేసెస్
4) ప్రెస్టన్
- View Answer
- Answer: 1