Mallu Swarajyam: సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇకలేరు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధురాలు మల్లు స్వరాజ్యం(91) ఇకలేరు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 19న తుది శ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని మెడికల్‌ కళాశాలకు మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని అప్పగించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాం రెడ్డి–చొక్కమ్మ దంపతులకు 1931లో స్వరాజ్యం జన్మించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా అణగారిన వర్గాల  కోసం పాటుబడ్డారు.

New Ambassador: చైనాలో భారత కొత్త రాయబారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

పోరాటమే ఊపిరిగా..

  • నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా నాడు తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, బావ రాజిరెడ్డిలతో కలిసి స్వరాజ్యం సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 
  • తన మాటలు, పాటలు, ప్రసంగాలతో మహిళలను ఆకర్షించి వారూ ఉద్యమంలో పాల్గొనేలా చేశారు.
  • 1945–48 సంవత్సరాల మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం క్రియాశీలక పాత్ర పోషించారు.
  • సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాలో పని చేశారు. అజ్ఞాతంలో ఉండి రాజక్క పేరుతో దళాలను నిర్మించి, నడిపించారు.
  • సాయుధ పోరాటం తర్వాత ఉద్యమ సహచరుడు మల్లు వెంకటనర్సింహారెడ్డితో 1954 మే నెలలో స్వరాజ్యం వివాహం జరిగింది.

రాజకీయ ప్రస్థానం ఇలా..

  • సాయుధ పోరాటం ముగిసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన స్వరాజ్యం రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారు.
  • హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లలో రెండు పర్యాయాలు సీపీఐ(ఎం) తరఫున ఎన్నికయ్యారు. 
  • 1985లో ప్రభుత్వం కూలిపోవడంతో.. 1985, 1989 రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1996లో మిర్యాలగూడెం పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
  • పార్టీ నాయకురాలిగా నిరంతరం సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 
  • 1994లో నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్యం పాల్గొన్నారు.
  • స్వరాజ్యం జీవితకథ ‘నా మాటే తుపాకీ తూటా’ పుస్తక రూపంలో ప్రచురించారు. 
  • వామపక్షభావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ’చైతన్య మానవి’సంపాదకవర్గంలో ఒకరుగా స్వరాజ్యం సేవలు అందించారు.

Aam Aadmi Party Leader: పంజాబ్‌ నూతన సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధురాలు కన్నుమూత
ఎప్పుడు : మార్చి 19
ఎవరు    : మల్లు స్వరాజ్యం(91)
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : అనారోగ్యం కారణంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags