Sujata Saunik: మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ నియమితురాలయ్యారు.
ఐఏఎస్ అధికారి నితిన్ కరీర్ పదవీ విరమణ అనంతరం ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు. 64 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఈ అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. జూన్ 30వ తేదీ దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో సుజాతా బాధ్యతలను స్వీకరించారు.
1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాతా సౌనిక్ ఆరోగ్యం, ఆర్థికం, విద్య, విపత్తు నిర్వహణ తదితర శాఖలలో గతంలో కీలక పాత్రలు పోషించారు. ఆమె ఒక సంవత్సరం పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
Global Marketing Award: ప్రొఫెసర్ జగదీష్ షేత్‌కు గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు
#Tags