Comviva CEO: టెక్ మహీంద్రా కంపెనీ ‘కామ్‌వివా’కి కొత్త సీఈవో
టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ అయిన డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కామ్‌వివాకి కొత్త సీఈవో నియమితులయ్యారు.
రాజేష్ చంద్రమణిని సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
2024 మేలో పదవీ విరమణ చేసిన మనోరంజన్ 'మావో' మహాపాత్ర నుంచి రాజేష్ చంద్రమణి పగ్గాలు చేపట్టారు. కాగా కామ్‌వివా బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మహాపాత్ర కొనసాగుతారని కంపెనీ తెలిపింది.
రాజేష్ చంద్రమణి గతంలో టెక్ మహీంద్రాలో సీనియర్ నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఆయన అక్కడ కమ్యూనికేషన్స్, మీడియా & ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, జపాన్, భారత్‌లో వ్యూహాత్మక మార్కెట్లకు బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేశారు.
Gopi Thotakura: అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తెలుగోడు.. తొలి భారత స్పేస్ టూరిస్ట్ ఈయనే..!
#Tags