Rachel Reeves: యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులైన‌ రాచెల్‌ రీవ్స్

యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా 45 ఏళ్ల రాచెల్‌ రీవ్స్‌ నియమితులయ్యారు.

ఆమె ఇప్పుడు బడ్జెట్‌కు బాధ్యత వహిస్తున్నారు. ఆమె ఈ అత్యన్నత పదవిని దక్కించుకుని.. తన కెరీర్‌లోనూ, యూకే చరిత్రలోనూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. 

యూకే కొత్త ప్రధాని కైర్‌ స్టార్మర్‌ ద్వారా ఈ అత్యున్నత పదవీలో నిమితులయ్యారు రీవ్స్‌. ఈ మేరకు రీవ్స్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా.. ఖజానకు ఛాన్సలర్‌గా నియమించడబడటం తన జీవితంలోని గొప్ప గౌరవంగా భావిస్తున్నా అన్నారు. 

ఎవరీ రాచెల్‌ రీవ్స్‌..?
లండన్‌ బోరో లెవిషామ్‌లోని విద్యావేత్తలకు ఫిబ్రవరి 13, 1979న జన్మించిన రీవ్స్‌ ఎల్లప్పుడూ సమగ్ర విద్యను నేర్చుకోవడం పట్ల అత్యంత ఆసక్తి కనబర్చేది. ఆమె న్యూ కాలేజీ ఆక్స్‌ఫర్డ్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీని పూర్తి చేసింది.

గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం రీవ్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో దాదాపు ఒక దశాబ్దం పాటు ఆర్థికవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ రంగానికి మారారు. రీవ్స్ 2021లో లేబర్ ఫైనాన్స్ పాలసీ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న స్టార్మర్ వద్ద షాడో ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా పని చేశారు. 

UK Election Result: బ్రిటన్‌ ఎన్నికల్లో.. రికార్డు స్థాయిలో ఇండియన్ల గెలుపు!

అలాగే..  ఆమె అనేక చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లను కూడా గెలుచుకుంది. తన తండ్రి ప్రభావంతో రాజకీయాలవైపు మొగ్గు చూపారు రీవ్స్‌. అలా 2010లో లిబరల్ డెమోక్రాట్‌లతో సంకీర్ణంలో కన్జర్వేటివ్‌లు అధికారంలోకి వచ్చినప్పుడు, రీవ్స్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని లీడ్స్ వెస్ట్‌కు లేబర్ ఎంపీగా ఎన్నికయ్యారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత స్టార్మర్ ఆమెను లేబర్ ఆర్థిక ప్రతినిధిగా నియమించారు. అలాగే ఆమె సోదరి ఎల్లీ రీవ్స్ కూడా లేబర్ పార్టీ ఎంపీ.

ప్రస్తుతం రీవ్స్‌ యూకే తొలి మహిళా ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా మందగమన వృద్ధి, అధిక రుణాలు, అత్యధిక పన్ను భారం వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంది. ఆమె వీటన్నింటిని అధిగమించేలా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాల పట్ల నిబద్ధత వ్యవహరించి ఆర్థిక పాలనా ప్రపంచంలో మంచి విజయం సాధించాలనే సంకల్పంతో ఉంది రాచెల్‌ రీవ్స్‌.

UK Election Results: యూకే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ.. 

#Tags