UPSC: యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న‌ది ఈమెనే...

కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదాన్ త్వరలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నారు. మాజీ చైర్‌పర్సన్ మనోజ్ సోని వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది.

ప్రీతి సుదాన్ ఆగస్టు 1వ తేదీ రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 316ఏ ప్ర‌కారం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించ‌నున్నారు. ఈమె ఏప్రిల్ 29, 2025 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

➤ ప్రీతి సుదాన్ 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఆమె, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో డిగ్రీలు పొందారు.

➤ ప్రీతి ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు. విపత్తు నిర్వహణ, పర్యాటక రంగాలలోనూ ఆమె అనుభవం ఉంది. కరోనా సమయంలో కూడా ఆమె క్రియాశీలకంగా విధులు నిర్వహించారు.
➤ ఈమె ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా కూడా పనిచేశారు.

Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్‌.. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే

#Tags