TATA Group: టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?

పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ.. టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌ రెండో విడత కొనసాగనున్నారు. గత అయిదేళ్ల పనితీరును సమీక్షించి, ఆయన్ను తిరిగి చైర్మన్‌గా కొనసాగించే అంశాన్ని చర్చించేందుకు ఫిబ్రవరి 11న సమావేశమైన టాటా సన్స్‌ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం చంద్రశేఖరన్‌ మరో అయిదేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. చంద్రశేఖరన్‌ పునర్నియామకానికి టాటా సన్స్‌లో మెజారిటీ వాటాలు ఉన్న టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ రతన్‌ టాటా గట్టిగా మద్దతు పలికారు.

సంక్షోభ సమయంలో సారథ్యం..

2016లో సైరస్‌ మిస్త్రీ ఉద్వాసనకు గురైన తర్వాత, టాటా సన్స్‌కి నాయకత్వ సంక్షోభం తలెత్తిన తరుణంలో .. చంద్రశేఖరన్‌ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. అప్పటిదాకా ఆయన టాటా గ్రూప్‌లో కీలకమైన టీసీఎస్‌కు సారథ్యం వహించారు. 2016లో టాటా సన్స్‌ బోర్డులో  చేరిన చంద్రశేఖరన్‌.. 2017 జనవరిలో చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017 ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు.

చ‌ద‌వండి: ఇండియా మార్ట్‌గేజ్డ్‌ పుస్తకాన్ని ఎవరు రచించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా రెండో విడత(ఐదేళ్లు) కొనసాగింపు
ఎప్పుడు  : ఫిబ్రవరి 11
ఎవరు    : ఎన్‌ చంద్రశేఖరన్‌
ఎందుకు : టాటా సన్స్‌ బోర్డు నిర్ణయం మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags