Kami Rita Sherpa: 30వ సారి ఎవ‌రెస్ట్ ఎక్కి చ‌రిత్ర సృష్టించిన కామి రీటా..

30వ సారి ఎవరెస్ట్‌ పర్వతాన్ని ఎక్కి త‌న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టాడు కామి రీటా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: నేపాలీ షెర్పా కామి రీటా చరిత్ర సృష్టించాడు. ఆయన 30వ సారి ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆ శిఖరానికి పది రోజుల్లోపు రెండోసారి చేరుకున్నాడు. ఈ సీజన్‌లో రెండుసార్లు ఎవరెస్ట్‌ ఎక్కి కొత్త రికార్డును నెలకొల్పాడు. 54 ఏళ్ల కామి రీటా.. మే 12వ తేదీన ఎవరెస్టుపైకి 29వ సారి చేరుకున్నాడని, మే 22న 30వ సారి అతను శిఖరాన్ని ఎక్కినట్లు పేర్కొన్నాడు. ఈ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన గత రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇంత వ‌య‌స్సులో కూడా ఒక వారంలో 8,848.86 మీటర్ల శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించి తనేంటో ప్ర‌పంచానికి చూపించాడు. ఈ విజ‌యాన్ని సాధించి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచాడు. ఎంత వ‌య‌స్సున్నా, మ‌నం చేయాల‌నుకుంటే ఎంత క‌ష్టమైనా సాధించ‌గ‌లం అని నిరూపించాడు.

Kaamya Karthikeyan: శెభాష్‌.. 16 ఏళ్లకే ఎవరెస్ట్‌ను అధిరోహించిన కామ్య కార్తికేయన్‌!

#Tags