Satyanarayana Raju: కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా సత్యనారాయణ రాజు

కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓగా (ఎండీ, సీఈఓ) కే సత్యనారాయణ రాజు నియమితులయ్యారు.

తక్షణం అమల్లోకి వచ్చేలా ఈ నియామకం జరిగినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది డిసెంబర్‌ 31న బాధ్యతలు విరమించిన ఎల్‌వీ ప్రభాకర్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. ఆయన 2021 మార్చి నుంచి కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఫిజిక్స్‌ గ్రాడ్యుయేట్, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బ్యాంకింగ్, ఫైనాన్స్‌) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అయిన రాజు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌ సర్టిఫైడ్‌ అసో సియేట్‌ (సీఏఐఐబీ) కూడా కావడం గమనార్హం. 

Indian American Usha Reddy: అమెరికాలో సెనేటర్‌ గా భారతీయ అమెరికన్‌

 

#Tags